![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -203 లో.....రుద్ర, గంగలని బాక్సింగ్ కి దూరం చెయ్యాలని వాళ్ళని హానీమూన్ కి పంపించాలని అనుకుంటుంది శకుంతల. దాంతో గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. జీవితం అంటే ఒక్కటే కాదు అన్ని ఉండాలని శకుంతల చెప్తుంది. వాళ్ళ హానీమూన్ కి ఏర్పాట్లు చెయ్యమని వీరూతో శకుంతల చెప్తుంది. అసలు ఏమైంది అత్తయ్యకి వాళ్ళని హానీమూన్ కి ఎందుకు పంపాలనుకుంటుందని వీరు, ఇషిక షాక్ అవుతారు. శకుంతల మంచి నిర్ణయం తీసుకుందని పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు.
శకుంతల దగ్గరికి పెద్దసారు వచ్చి.. మనం బయటకు వెళదాం.. గుడికి వెళ్లి బయటే భోజనం చేసి వద్దామని పెద్దసారు అనగానే ఏంటి సడెన్ గా ఇంత మార్పు అని శకుంతల అడుగుతుంది. నువ్వు కూడ రుద్ర, గంగల విషయంలో మారటవు కదా అని శకుంతలతో పెద్దసారు అంటాడు. నేను వాళ్ళని బాక్సింగ్ కి దూరం చెయ్యడానికి మాత్రమే ఇలా చేస్తున్నాను.. ఆ గంగని ఎప్పటికి కోడలిగా ఒప్పుకోనని శకుంతల అంటుంది. మరొకవైపు రుద్ర వచ్చి గంగతో హానీ మూన్ కి సంబంధించిన డిస్కషన్ చేసినట్లు ఉహించుకుంటుంది. అప్పుడు నిజంగానే రుద్ర వచ్చి ఈ పేపర్స్ పై సంతకం పెట్టు అంటాడు. ఏంటి అని గంగ అడుగుతుంది. ఇది బాక్సింగ్ అప్లికేషన్ ఫామ్.. ఆ విషయం నీకు చెప్తే పెద్దమ్మకి చెప్పాలని అంటావ్.. అందుకే అబద్ధం చెప్తున్నానని ఈ ఫామ్ నీ వీసా కోసమని రుద్ర అబద్ధం చెప్తాడు. దాంతో గంగ సంతకం పెడుతుంది
ఆ తర్వాత వాళ్ళు హానీమూన్ కి వెళ్లడం ఇష్టం లేని వీరు... గంగకి వీసా లేదని అంటాడు. బయట దేశాలకి వీసా అవసరం కానీ లోకల్ లో ఉండే ప్లేస్ లో వెళ్ళడానికి అవసరం లేదు కదా గోవాకి వెళ్తారని శకుంతల చెప్తుంది. ఆ తర్వాత స్నేహ, సూర్య, వంశీ కలిసి వాళ్ళ హానీమూన్ కి బ్యాగ్ సర్దుతారు. ఆ తర్వాత అంత సిద్ధం అయి హాల్లోకి వస్తారు. వాళ్ళకి ప్రీతి ఎదురు రా అని శకుంతల చెప్తుంది. అప్పుడే ప్రీతి కళ్ళు తిరిగిపడిపోతుంది. వెంటనే డాక్టర్ వచ్చి చెకప్ చేసి టాబ్లెట్ ఓవర్ డోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |